Chandrababu: నందమూరి బాలకృష్ణకు చంద్రబాబు విషెస్

Chandrababu Wishes Balakrishna On His Birth Day
  • ప్రతీ కార్యక్రమం విజయవంతమవ్వాలని ఆకాంక్ష
  • నిండునూరేళ్లు వర్ధిల్లాలని శుభాకాంక్షలు
  • ఇవాళ 62 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలుగు సినీ కథానాయకులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. కళాసేవ, ప్రజాసేవ, సామాజిక సేవా కార్యక్రమాలతో అశేష అభిమానుల ఆదరణ చూరగొంటున్న మీరు.. చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి. ఎనలేని కీర్తి సంపదలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.   

కాగా, బాలకృష్ణ ఇవాళ 62 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా 107వ సినిమా టీజర్ నూ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Chandrababu
Balakrishna
Telugudesam

More Telugu News