అప్పటివరకు తిట్టిన నాయకులు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో గమనించాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan interesting tweets
  • ఆసక్తికర ట్వీట్లు చేసిన పవన్
  • పొగిడే నేతలను చూసి పడిపోవద్దని హితవు
  • అలాంటి నేతలు మారినట్టు భావించరాదని వెల్లడి
  • అలా భావిస్తే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్టేనని స్పష్టీకరణ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు . అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడడం ప్రారంభిస్తారని, అయితే ఆ పొగడ్తలు చూసి ఆ నాయకుడు మారిపోయాడని, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు కొట్టి, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్టేనని పేర్కొన్నారు. 

అప్పటివరకు తిట్టిన నాయకులు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ఆలోచించాలని పిలుపునిచ్చారు. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి... అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తించండి... జర భద్రం! అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Tweets
Leaders
Janasena
Andhra Pradesh

More Telugu News