బెంగాల్ విభజనను అడ్డుకునేందుకు రక్తాన్ని చిందించేందుకు సిద్ధంగా ఉన్నా: మమతా బెనర్జీ
- బెంగాల్ లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను బీజేపీ రెచ్చగొడుతోందన్న మమత
- దశాబ్దాలుగా బెంగాల్ ప్రజలు సామరస్యంతో జీవిస్తున్నారని వ్యాఖ్య
- జీవన్ సింగ్లా బెదిరింపులకు భయపడనన్న మమత
మరోవైపు ప్రత్యేక కాంతాపూర్ ను వ్యతిరేకిస్తే మమతా బెనర్జీ రక్తాన్ని కళ్లచూస్తామని కాంతాపూర్ లిబరేషన్ సంస్థ నేత జీవన్ సింగ్లా హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై మమతా బెనర్జీ స్పందిస్తూ... అలాంటి బెదిరింపులు తనను ఏమీ చేయలేవని అన్నారు. అలాంటి వాటిని లెక్క చేయనని, అలాంటి బెదిరింపులకు భయపడనని చెప్పారు.