వాస్తవాలను పోలీసులు ఎందుకు దాస్తున్నారు?: షర్మిల
- హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం
- కలకలం రేపుతున్న గ్యాంగ్ రేప్ ఘటన
- అధికార పార్టీ నేతలు దారుణానికి పాల్పడ్డారన్న షర్మిల
ఈ కేసులో హోంమంత్రి మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కొడుకు ప్రమేయం ఉందనే వార్తలు వస్తున్నాయని చెప్పారు. వాస్తవాలను పోలీసులు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. పెద్ద నేతల బిడ్డలయినంత మాత్రాన చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఘటన జరిగి వారం రోజులు అయిందని... ఇంత వరకు నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని షర్మిల నిలదీశారు.