అప్పుడ‌లా, ఇప్పుడిలా!...కేసీఆర్‌తో బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడ‌లా, ఇప్పుడిలా!...కేసీఆర్‌తో బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌!

kcr and nikhat zareen old and new photos goes viral on social media
  • 2014లో కేసీఆర్‌ను క‌లిసిన నిఖ‌త్‌
  • తాజాగా బాక్సింగ్ చాంపియ‌న్ హోదాలో కేసీఆర్‌తో భేటీ
  • రెండు ఫొటోల్లోనూ పిడికిళ్లు బిగించి మ‌రీ ఫొటోల‌కు పోజులిచ్చిన వైనం
వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించిన తెలంగాణ మ‌హిళా బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ సీఎం కేసీఆర్‌తో క‌లిసి దిగిన రెండు ఫొటోలు సోష‌ల్ మీడియా వేదికగా వైర‌ల్ గా మారిపోయాయి. వర‌ల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా స‌త్తా చాటిన నిఖ‌త్‌ను గురువారం ఘ‌నంగా స‌న్మానించిన కేసీఆర్‌... ఆమెకు ప్ర‌క‌టించిన రూ.2 కోట్ల న‌గ‌దు పుర‌స్కారాన్ని కూడా అంద‌జేశారు. 

ఈ సంద‌ర్బంగా కేసీఆర్‌తో క‌లిసి నిఖ‌త్ తీయించుకున్న ఫొటోలో... నిఖ‌త్ పిడికిలి బిగించి పంచ్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌న్న‌ట్లుగా పోజు పెడితే... తానూ పంచ్ వేస్తాన‌న్న రీతిలో కేసీఆర్ కూడా త‌న పిడికిలిని చూపారు.
ఈ ఫొటో మాదిరిగానే ప‌రస్ప‌రం బిగిసిన పిడికిళ్లు చూపించుకుంటున్న‌ కేసీఆర్‌, నిఖ‌త్‌ల ఫొటో ఒక‌టి 2014లో తీశారు. ఈ రెండు ఫొటోల‌ను ప‌క్క‌ప‌క్క‌నే పెట్టి 2014లో ఎలా మొదలైందో... 2022లో అలాగే కొనసాగుతోంది అన్న కామెంట్‌తో ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. 

ఈ ఫొటోను టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా కో ఆర్డినేట‌ర్ వై స‌తీశ్ రెడ్డి పోస్ట్ చేశారు. 2014లో తీసిన ఫొటోలో నిఖ‌త్ పిడికిలి కేసీఆర్ పిడికిలి కంటే కాస్తంత కింద ఉండ‌గా.. ఇప్పుడు తీసిన ఫొటో మాత్రం కేసీఆర్ పిడికిలి కంటే నిఖ‌త్ పిడికిలి కాస్తంత పైన ఉంది. 2014 ఫొటోలో అప్పుడ‌ప్పుడే బాక్సింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా క‌నిపిస్తున్న‌ నిఖ‌త్‌... తాజా ఫొటోలో వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్ హోదాలో కేసీఆర్‌తో క‌లిసి క‌నిపించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.
KCR
Telangana
TRS
Nikhat Zareen
Boxer

More Telugu News