జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు విషయంపై.. డీజీపీని కలవనున్న పవన్ కల్యాణ్
- డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరిన పార్టీ
- అపాయింట్‌మెంట్ రాగానే వెళ్లి కలవనున్న నాయకుల బృందం
- వెల్లడించిన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్
అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని నాయకుల బృందం డీజీపీని కలుస్తుందని మనోహర్ వివరించారు. డీజీపీని కలిసి కార్యకర్తలు, నాయకులపై మోపుతున్న అక్రమ కేసులను ఆయన దృష్టికి తీసుకెళ్తారని, వారికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతారని పేర్కొన్నారు.