కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఇంట్లో చోరీ.. భార్య డైమండ్ నెక్లెస్ మాయం

Congress leader KVP Wife Diamond Necklace Theft
  • రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు
  • ఈ నెల 11న నెక్లెస్ ధరించి ఫంక్షన్‌కు వెళ్లిన సునీత
  • ఇంటికి వచ్చిన కాసేపటికే చోరీ
  • ఇంటి పనివారిపై అనుమానం
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు భార్య సునీత డైమండ్ నెక్లెస్ చోరీకి గురైంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఆమె హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఈ నెల 11న ఆమె డైమండ్ నెక్లెస్ ధరించి ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగించుకుని ఇంటికి చేరుకున్న కాసేపటికే నెక్లెస్ మాయమైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. తన ఇంట్లోని పనివారిపైనే ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సునీత ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
KVP Ramachandra Rao
Congress
Diamond Necklace
Theft

More Telugu News