TDP: రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కుపోయింది!... జ‌గ‌న్ మూడేళ్ల పాల‌న‌పై టీడీపీ చార్జిషీట్ విడుద‌ల‌!

tdp releases chrgesheet on ys jagan three year regime
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూడేళ్ల పాల‌న‌లో ఏపీ 30 ఏళ్లు వెన‌క్కు పోయింద‌ని టీడీపీ ఆరోపించింది. సోమ‌వారం ఏపీ సీఎంగా జ‌గ‌న్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వైసీపీ సంబ‌రాలు చేసుకుంటూ ఉంటే... విప‌క్ష టీడీపీ జ‌గ‌న్ పాల‌న‌లోని లోపాల‌ను ఎత్తి చూపుతూ ఏకంగా ఓ చార్జిషీట్‌ను విడుద‌ల చేసింది. ఈ చార్జిషీట్ విడుద‌ల సంద‌ర్భంగా విశాఖ‌లో టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

ఏపీలో విధ్వంసంతో పాల‌న‌ను ప్రారంభించిన నేత‌గా జ‌గ‌న్ నిలిచిపోయార‌ని అచ్చెన్న ధ్వ‌జ‌మెత్తారు. రివ‌ర్స్ టెండ‌రింగ్‌లో రాష్ట్రం తిరోగ‌మ‌నంలోకి వెళ్లిపోయింద‌ని ఆయ‌న ఆరోపించారు. మోస‌పూరిత సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని అన్యాయం చేశార‌న్నారు. సొంత మ‌నుషుల‌కు జ‌గ‌న్‌ నిధులు దోచి పెట్టార‌ని ఆరోపించారు. టీడీపీ పాల‌న‌లో స‌న్ రైజ్ ఏపీగా ఉన్న రాష్ట్రం... జ‌గ‌న్ పాల‌న నేరాలు ఘోరాల మ‌యంగా మారిపోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.
Go Back to Shorts
TDP
Andhra Pradesh
YS Jagan
YSRCP
Atchannaidu

More Telugu News