కోస్తాపై భానుడి భగభగలు.. ఎండల తీవ్రతకు అల్లాడిపోతున్న జనం
- 21 మండలాల్లో వీచిన వడగాలులు
- నేడు కూడా రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్న అధికారులు
- అప్రమత్తంగా ఉండాలని సూచన
- కోస్తా, రాయలసీమల్లో నేడు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
తణుకు, తాడేపల్లిగూడెం, ఇబ్రహీంపట్నం, ఉండ్రాజవరంలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 84 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కోస్తా, రాయలసీమల్లో నేడు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.