వైసీపీ చేతకానితనం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు: బీజేపీ ఎంపీ జీవీఎల్
- వైసీపీకి పాలన చేతకాదని తేలిపోయిందన్న జీవీఎల్
- దావోస్ పర్యటనపై వస్తున్న విమర్శలపై సమాధానం చెప్పాలని డిమాండ్
- స్పీకర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్య
అమలాపురం అల్లర్లపై ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ వైఫల్యం వల్ల అల్లర్లు చెలరేగాయా? లేక కావాలనే చేసిన పనా? అని ప్రశ్నించారు. వైసీపీ చేపట్టిన బస్సు యాత్రలో శాసనసభ స్పీకర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని... రాజకీయాలు మాట్లాడాలనుకుంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని అన్నారు.