జీహెచ్ఎంసీ పరిధిలో వాహనాల వేగ పరిమితి పెంపు!
- ప్రస్తుతం అన్ని వాహనాల వేగం గంటకు 40 కిలో మీటర్లు
- తాజాగా వాహనాలు, ఆయా రోడ్లపై వేగ పరిమితి వేర్వేరుగా ప్రకటన
- అత్యధిక వేగంగా కార్లకు గంటకు 60 కిలో మీటర్లు
- కాలనీల్లో అన్ని వాహనాల వేగం గంటకు 30 కిలో మీటర్లు
డివైడర్లు ఉన్న చోట (డబుల్ లేన్) కార్లు గంటకు 60 కిలో మీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతించిన పోలీసు శాఖ... ఆ ప్రాంతాల్లో బస్సులు, బైకుల స్పీడును మాత్రం గంటకు 50 కీలో మీటర్లుగా నిర్ణయించింది. ఇక నగర పరిధిలో డివైడర్లు లేని చోట కార్ల వేగాన్ని గంటకు 50 కీలో మీటర్లు కాగా... బస్సులు, బైకుల వేగం మాత్రం గంటకు 40 కీలో మీటర్లుగా ఉంది. ఇక కాలనీల్లో అన్ని రకాల వాహనాల వేగం 30 కిలో మీటర్లకు మించరాదని పోలీసు శాఖ ప్రకటించింది.