తైవాన్ అంశంలో ప్రమాదంతో చెలగాటమాడుతున్నారన్న బైడెన్... దేశ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తామన్న చైనా
- క్వాడ్ సమావేశం కోసం జపాన్ వచ్చిన బైడెన్
- తైవాన్ కు మద్దతుగా అమెరికా వ్యాఖ్యలు
- చైనా దాడి చేస్తే తైవాన్ ను కాపాడతామని భరోసా
- మండిపడిన చైనా
- ఎవరినీ లెక్కచేయబోమని వార్నింగ్
బైడెన్ వ్యాఖ్యలతో చైనా మండిపడింది. తైవాన్ విషయంలో దేశ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమేనని చైనా అధినాయకత్వం దీటుగా బదులిచ్చింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ స్పందిస్తూ, చైనా భూభాగంలో తైవాన్ విడదీయరాని భాగం అని స్పష్టం చేశారు. తైవాన్ అంశం పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారం అని ఉద్ఘాటించారు.
చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి అంశాల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదని లేదని, రాజీపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చైనా దృఢ సంకల్పాన్ని, దేశ సర్వసత్తాక ప్రయోజనాల దిశగా చైనా ప్రజల బలీయమైన సామర్థ్యాలను ఎవరూ తక్కువ అంచనా వేయరాదని వెన్ బిన్ స్పష్టం చేశారు.