Pawan Kalyan: కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan opines on Center has reduced excise duty on petrol and diesel
  • పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
  • కేంద్రం నిర్ణయంతో తగ్గిన పెట్రో ధరలు
  • సామాన్యుడికి ఎంతో ఊరట అన్న పవన్ 
  • ఏపీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని విజ్ఞప్తి
పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రకటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడికి ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. ఇంతటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. 

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, వర్షాకాలం రాకముందే రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు.
Pawan Kalyan
Petrol
Diesel
Excice Duty
Narendra Modi
Andhra Pradesh

More Telugu News