CM KCR: ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసానికి తరలి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్

CM KCR met Delhi CM Kejriwal in Delhi
  • ఢిల్లీలో కేసీఆర్ పర్యటన
  • కేజ్రీవాల్ తో భేటీ
  • దేశ రాజకీయాలపై చర్చ
  • అనేక అంశాల ప్రస్తావన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ ను శాలువా కప్పి సన్మానించారు. ఆయనకు ఓ వీణ బొమ్మను జ్ఞాపికగా బహూకరించారు. అనంతరం ఇరువురు సమావేశమై పలు అంశాలను చర్చించారు. 

ప్రస్తుత జాతీయ రాజకీయాలు, రాజ్యాంగపరమైన అంశాలు, దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఇతర అంశాలపై సమాలోచనలు చేశారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేతా, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు ఉన్నారు.

కాగా, కేజ్రీవాల్ తన నివాసంలో సీఎం కేసీఆర్ తదితరులకు విందు ఏర్పాటు చేశారు. 

.
CM KCR
Arvind Kejriwal
New Delhi
Telangana
TRS
AAP

More Telugu News