KTR: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా మరోసారి కేటీఆర్ ఎన్నిక

KTR once again elected as president of Telangana Badminton Association
  • హైదరాబాద్ లో ఎన్నికలు
  • ఏకగ్రీవంగా నెగ్గిన కేటీఆర్
  • వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా విజయం
  • ప్రధాన కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్
తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి తాజాగా నిర్వహించిన ఎన్నికల్లోనూ ఆయన ఏకగ్రీవం అయ్యారు. వరుసగా రెండోసారి బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు నేడు హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఎఫ్ఎన్ సీసీ క్లబ్ లో ఎన్నికలు నిర్వహించారు. 

బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్ ఎన్నికయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా యుగంధర్ రావు, వైస్ ప్రెసిడెంట్ గా చాముండేశ్వరినాథ్, కోశాధికారిగా పాణీరావు ఎన్నికయ్యారు.
KTR
President
Telangana Badminton Association
Elections
TRS
Telangana

More Telugu News