శుభ్ మాన్ గిల్ కు కోహ్లీ వార్నింగ్... వీడియో ఇదిగో!

20-05-2022 Fri 19:20
  • నిన్న ఐపీఎల్ లో గుజరాత్, బెంగళూరు ఢీ
  • అద్భుతంగా ఆడి బెంగళూరును గెలిపించిన కోహ్లీ
  • మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్
  • గిల్ పై స్లెడ్జింగ్ కు దిగిన కోహ్లీ
Kohli warns Gill
మైదానంలో దిగిన తర్వాత విరాట్ కోహ్లీ టెంపర్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటలోనే కాదు, మాటల్లోనూ, చేతల్లోనూ కోహ్లీ దూకుడు ప్రదర్శిస్తుంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎవరైనా సరే లెక్కచేయని మనస్తత్వం కోహ్లీది. మాటకు మాట బదులివ్వడం, మైదానంలో గొడవకు దిగేందుకైనా వెనుకాడకపోవడం కోహ్లీ నైజం. నిన్న జరిగిన బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లోనూ ఈ విషయం స్పష్టమైంది. 

ఈ మ్యాచ్ లో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్ మాన్ గిల్ పై కోహ్లీ స్లెడ్జింగ్ కు దిగాడు. గిల్ ను చూస్తూ "చంపేస్తా" అన్నట్టుగా సంజ్ఞ చేశాడు. అచ్చం... డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్ లో అండర్ టేకర్ చేసినట్టు చేశాడు. దాంతో గిల్ కూడా కోహ్లీ వైపు సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయాడు. 

కాగా, ఈ మ్యాచ్ లో కోహ్లీ వీరోచితంగా ఆడి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించడం తెలిసిందే. కోహ్లీ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. దాంతో 169 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా, ఈ మ్యాచ్ లో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేయగా, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ కేవలం ఒక్క పరుగుకే అవుటయ్యాడు.