మే 20 నుంచి ఓటీటీలో 'ఆర్ఆర్ఆర్'.. ట్రైలర్ విడుదల చేసిన జీ5.. మీరూ చూడండి!

OTT platform ZEE5 releases RRR trailer
  • థియేటర్లలో మోత మోగించిన 'ఆర్ఆర్ఆర్'
  • ఇప్పుడు ఇళ్లలోకి వచ్చేస్తున్న భీమ్, అల్లూరి
  • నీరు, నిప్పు ఒక శక్తిగా వస్తున్నాయన్న జీ5
టాలీవుడ్ స్టామినా ఏంటో 'ఆర్ఆర్ఆర్' సినిమా మరోసారి ప్రపంచానికి చాటింది. దక్షిణాది నాలుగు భాషలతో పాటు హిందీలో కూడా విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. రూ. 1,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సత్తా చాటింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల అద్భుతమైన పర్ఫామెన్స్ కు సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ఇక దర్శక దిగ్గజం రాజమౌళి తనకు తిరుగేలేదని మరోసారి చాటి చెప్పారు. 

ఇప్పటి వరకు థియేటర్లలో మోత మోగించిన 'ఆర్ఆర్ఆర్' ఇప్పుడు ప్రేక్షకుల ఇళ్లలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఈ చిత్రాన్ని మే 20 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను జీ5 కాసేపటి క్రితం విడుదల చేసింది. నీరు, నిప్పు కలిసి ఒక శక్తిగా వస్తున్నాయంటూ జీ5 పేర్కొంది. 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఓటీటీలో రానుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
RRR
OTT
ZEE5
Trailer

More Telugu News