కర్ణాటక ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీకి తెలంగాణ ఫిర్యాదు
- అప్పర్ తుంగ, అప్పర్ భద్రతల నిర్మాణం ఆపాలని కోరిన తెలంగాణ
- కృష్ణా నది నుంచి తుంగభద్రకు వరద నీరు తగ్గుతోందని వెల్లడి
- ఫలితంగా దిగువ రాష్ట్రమైన తమకు అన్యాయమన్న తెలంగాణ
కృష్ణా నది నుంచి తుంగభద్రకు వరద నీరు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రాజెక్టుల కారణంగా దిగువ ప్రాంతమైన తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలిపింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోందని కూడా తెలంగాణ గుర్తు చేసింది.