Vishnu Vardhan Reddy: మంత్రులను మార్చడం కాదు... రాష్ట్రంలో సీఎంనే మార్చాలి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

BJP leader Vishnu Vardhan Reddy says there will be change of CM
షార్ట్స్‌లో చూడండి
నిన్న నెల్లూరులో ప్రేమోన్మాది యువతిని కాల్చి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన విచారకరం అని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.  అటు సత్యసాయి జిల్లాలో వెంటవెంటనే రెండు ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా సీఎం స్పందించరా? హోంమంత్రి ఈ విషయాలపై నోరు మెదపరా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 

ఏది జరిగినా గంటలో మీడియా ముందుకు వచ్చే మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు వీటిపై మాట్లాడరా? అని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే  వైసీపీ నేతలు వీటిపై స్పందించకుండా, దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటనలపై సీఎం, హోంమంత్రి ఎందుకు సమీక్ష చేయలేదని విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. 

ఏపీలో శాంతిభద్రతల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మంత్రులను మార్చడం కాదని, ముఖ్యమంత్రినే మార్చితే పరిస్థితి అదుపులోకి వస్తుందని వ్యంగ్యంగా అన్నారు. 
Go Back to Shorts
Vishnu Vardhan Reddy
CM
YSRCP
Andhra Pradesh

More Telugu News