Surya Kumar Yadav: కోల్ కతాపై టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్... గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన సూర్యకుమార్ యాదవ్

Surya Kumar Yadav ruled out of IPL season due to forearm injury
  • ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
  • గాయంతో తప్పుకున్న సూర్యకుమార్
  • కోల్ కతా జట్టులో ఐదు మార్పులు
ఈ ఐపీఎల్ సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబయి ఇండియన్స్ మరో మ్యాచ్ కు సిద్ధమైంది. నేడు నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో పోటీ పడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

కాగా స్టార్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. సూర్యకుమార్ గత మ్యాచ్ లో ఎడమ ముంజేతి కండరాల గాయానికి గురయ్యాడు. అతడి స్థానంలో రమణ్ దీప్ ను తీసుకున్నట్టు ముంబయి సారథి రోహిత్ శర్మ వెల్లడించాడు. అటు, కోల్ కతా జట్టులో రహానే, కమిన్స్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, షెల్డన్ జాక్సన్ లకు స్థానం కల్పించారు.
Surya Kumar Yadav
IPL
Injury
Mumbai Indians
KKR

More Telugu News