TDP: వైసీపీని కొట్ట‌డం అంత ఈజీ కాదు: టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య‌

tdp leader varla ramaiah commnets on tdp alliance
  • ప‌వ‌న్‌తో పాటు అంద‌రూ టీడీపీతో క‌లిసి వ‌స్తారన్న రామయ్య 
  • అంద‌రూ క‌లిసి రావాల‌న్న‌దే చంద్ర‌బాబు ఆలోచ‌న‌ని వ్యాఖ్య 
  • 151 సీట్లు వ‌చ్చిన జ‌గ‌న్‌ను ఓడించాలంటే అంద‌రూ క‌ల‌వాల్సిందేన‌న్న వ‌ర్ల‌
2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య సోమ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం రాత్రి ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్న సంద‌ర్భంగా వ‌ర్ల ఈ వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని కొట్ట‌డం అంత ఈజీ కాద‌న్న ఆయ‌న‌... 151 సీట్లు గెలిచిన జ‌గ‌న్‌ను ఓడించాలంటే అంద‌రూ క‌ల‌వాల్సిందేన‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీతో ప‌లు పార్టీల పొత్తుల‌కు సంబంధించి కూడా వ‌ర్ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌తో పాటు అన్ని పార్టీలు క‌లిసి వస్తాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌మ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న కూడా అంద‌రూ క‌లిసి రావాల‌న్న దిశ‌గానే ఆలోచిస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. టీడీపీతో బీజేపీ పొత్తు విష‌యం చెప్పాల్సింది సోము వీర్రాజు కాద‌ని కూడా వ‌ర్ల తెలిపారు.
TDP
Varla Ramaiah
2024 Elections
Andhra Pradesh

More Telugu News