ఉన్నట్టుండి స్వదేశానికి ప్రయాణమైన హెట్ మేయర్..
- మొదటిసారి బేబీని ప్రసవించనున్న భార్య
- తొలి సంతానాన్ని ఆహ్వానించేందుకు వెళ్లిన గయనా క్రికెటర్
- కీలక సమయంలో భార్య పక్కన ఉండాలన్న నిర్ణయం
గయానీస్ క్రికెటర్ స్వదేశానికి వెళ్లాడని.. మిగిలిన మ్యాచ్ లకు రాజస్థాన్ జట్టుతో వచ్చి చేరతాడని తెలిపింది. రాజస్థాన్ జట్టు సభ్యులు అభినందనలు తెలుపుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ‘‘బేబీలు ఒక్కసారే జన్మిస్తారు. అందుకే ఈ సమయంలో నేను నా భార్య, కుటుంబంతో ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకున్నాను’’అంటూ హెట్ మేయర్ చెప్పాడు.
ఈ విషయంలో హెట్ మేయర్ కు తాము చేతనైనంత సాయంగా నిలుస్తామని రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రకటించింది. అతడు త్వరలోనే తిరిగొస్తాడని పేర్కొంది. శనివారం పంజాబ్ జట్టుపై విజయంలో హెట్ మేయర్ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. తద్వారా ప్లేఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంది.