Congress: గాంధీ భవన్‌కు తొలిసారి రాహుల్ గాంధీ రావ‌డంపై రేవంత్ రెడ్డి ట్వీట్‌

revanth reddy tweet on rahul gandhi visits gandhi bahvan
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ కార్యాల‌యంగా గాంధీ భ‌వ‌న్ కొన‌సాగుతోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉమ్మ‌డి ఏపీ కాంగ్రెస్ శాఖ‌కు ఇదే కార్యాల‌యంగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచిన గాంధీ భ‌వ‌న్‌కు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇప్ప‌టిదాకా రానే లేదు‌. అయితే తాజాగా రెండు రోజుల తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన రాహుల్ గాంధీ తొలిసారి గాంధీ భ‌వ‌న్‌లో అడుగుపెట్టారు. 

ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. చారిత్ర‌క క‌ట్ట‌డంగా ఉన్న గాంధీ భ‌వ‌న్‌కు త‌మ నేత రాహుల్ గాంధీ తొలి సారి రావ‌డం సంతోషాన్నిచ్చింద‌ని స‌ద‌రు ట్వీట్‌లో రేవంత్ పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు 'మైలీడ‌ర్ రాహుల్ గాంధీ' అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా ఆయ‌న జ‌త చేశారు.
Go Back to Shorts
Congress
Rahul Gandhi
Revanth Reddy
TPCC President
Gandhi Bahvan

More Telugu News