పార్టీ ఆదేశాల మేర‌కే క్యాంపున‌కు వెళ్లా: దుగ్గిరాల ఎంపీటీసీ ప‌ద్మావ‌తి

duggirala mptc clarity on her kidnap
  • ఎవ‌రూ బ‌ల‌వంతంగా తీసుకెళ్ల‌లేదన్న పద్మావతి 
  • సంతోషి రూప‌రాణిని ఎంపీపీగా ఎన్నుకున్నామని వ్యాఖ్య 
  • వీడియో విడుద‌ల చేసిన‌ ప‌ద్మావ‌తి
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీటీసీ ప‌ద్మావ‌తి కిడ్నాప్‌న‌కు గుర‌య్యారంటూ బుధ‌వారం నుంచి వినిపిస్తున్న వార్త‌ల‌పై స‌స్పెన్స్ వీడిపోయింది. గురువారం మ‌ధ్యాహ్నం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక పూర్తయ్యాక సాయంత్రం వేళ ఆమె త‌న ఇంటికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న అదృశ్యంపై ఆమె కీల‌క వ్యాఖ్య‌లతో కూడిన ఓ వీడియోను విడుద‌ల‌ చేశారు.

పార్టీ ఆదేశాల మేర‌కే తాను క్యాంపున‌కు వెళ్లాన‌ని చెప్పిన ప‌ద్మావ‌తి... త‌న‌ను ఎవ‌రూ బ‌ల‌వంతంగా తీసుకెళ్ల‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షు‌రాలిగా త‌మ పార్టీ త‌ర‌ఫున ఎంపీటీసీగా ఎన్నికైన సంతోషి రూప‌రాణిని ఎన్నుకున్నామ‌ని ఆమె తెలిపారు. స్వ‌యంగా ప‌ద్మావ‌తి నుంచే వీడియో రూపంలో ఈ ప్ర‌క‌ట‌న రావ‌డంతో ఆమె కిడ్నాప్‌న‌కు గురైంద‌న్న ప్ర‌చారానికి తెరపడింది. 
Go Back to Shorts
Duggirala
Mangalagiri
YSRCP

More Telugu News