దుగ్గిరాల మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా టీడీపీ నేత ఎన్నిక
- కో ఆప్షన్ సభ్యుడిగా టీడీపీ నేత వహిదుల్లా
- వహిదుల్లాకు అనుకూలంగా 10 ఓట్లు
- ఓటింగ్‌కు దూరంగా ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు
కో ఆప్షన్ సభ్యుడిగా టీడీపీ ప్రతిపాదించిన వహిదుల్లా ఎన్నికపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఐదుగురు ఓటింగ్‌లో పాలుపంచుకోలేదు. ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకే వీరు సమావేశం నుంచి బయటకు వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.