రేపే 'యశోద' నుంచి ఫస్టు గ్లింప్స్!

Yashoda Movie Update
  • సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా 'యశోద'
  • టైటిల్ రోల్ ను పోషించిన సమంత 
  • కీలకమైన పాత్రను పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ 
  • ఆగస్టు 12వ తేదీన  సినిమా విడుదల
నాయిక ప్రధానమైన మరో సినిమాను పట్టాలెక్కించిన సమంత, చాలా వేగంగా ఆ సినిమాను పూర్తి చేసింది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, హరి అండ్ హరీశ్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. 

ఈ నెల 5వ తేదీన .. అంటే రేపు ఉదయం 11:07 నిమిషాలకు ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఆ తరువాత టీజర్ లు  .. ట్రైలర్లు వరుసబెట్టనున్నాయి. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఆమె పాత్రను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. 

ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో రావు రమేశ్ .. సంపత్ రాజ్ .. మురళీ శర్మ .. ఉన్ని ముకుందన్ కనిపించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని సమంత భావిస్తోంది. ఇక ఆమె టైటిల్ రోల్ ను పోషించిన  'శాకుంతలం' కూడా సెట్స్ పైనే ఉంది.
Go Back to Shorts
Samantha
Varalakshmi Sharath Kumar
Yashoda Movie

More Telugu News