త్వరలో కొత్త పార్టీ పెడుతున్నా: తీన్మార్ మల్లన్న
- 7,200 మంది వెలమ దొరల భరతం పడతానన్న మల్లన్న
- ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడి
- 10 లక్షల మందితో హైదరాబాదులో సభ నిర్వహిస్తానన్న మల్లన్న
తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని తీన్మార్ మల్లన్న అన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ టీమ్ భయపడదని చెప్పారు. మరో 10 రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్తానని తెలిపారు. తనపై, తన కుటుంబంపై ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి, రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. ఆస్తులను త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇంతవరకు ఎవరూ లేరని చెప్పారు. ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 10 లక్షల మందితో బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 176 మంది చిన్నారులకు తమ టీమ్ గుండె చికిత్సలు చేయించిందని తెలిపారు.