Adivi Shesh: 'హిట్ 2' రిలీజ్ డేట్ ఖరారు!

  • అడివి శేష్ నుంచి వస్తున్న 'మేజర్'
  • మే 27వ తేదీన భారీ స్థాయి విడుదల 
  • శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్ 2'
  • విడుదల తేదీగా జులై 29 ఫిక్స్
HIT movie releaes date cinfirmed

నాని నిర్మాతగా ఇంతకుముందు 'హిట్  .. ది ఫస్టు కేస్' సినిమాను నిర్మించాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, విష్వక్సేన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో, సీక్వెల్ గా 'హిట్ 2'ను థియేటర్లకు తీసుకుని వస్తున్నారు. ఈ భాగాన్ని అడివి శేష్ హీరోగా రూపొందించారు.

' హిట్ ది సెకండ్ కేస్' అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. జూలై 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. 

జాన్ స్టీవర్టు సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి - కోమలి ప్రసాద్ కథానాయికలుగా అందాల సందడి చేయనున్నారు. భానుచందర్ .. రావు రమేశ్ .. పోసాని ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఇక అడివి శేష్ మరో చిత్రమైన 'మేజర్' మే 27వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ రెండు సినిమాలతో అడివి శేష్ ఏ స్థాయిలో మెప్పిస్తాడనేది చూడాలి.

More Telugu News