సామర్లకోటలో దారుణం: పట్టపగలు నడిరోడ్డుపై స్నేహితుడిని నరికి చంపిన యువకుడు
- స్నేహితుడు శివపై పగ పెంచుకున్న మణికంఠ
- బిర్యానీ కొనేందుకు వచ్చిన శివను నరికి చంపిన వైనం
- తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన మణికంఠ
మరోవైపు, శివపై పగ పెంచుకున్న మణికంఠ అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న బర్త్ డే కావడంతో శివ స్థానిక విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో బిర్యానీ కొనేందుకు వచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన మణికంఠ కత్తితో ఒక్కసారిగా శివపై దాడిచేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. మణికంఠ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శివ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మణికంఠ అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.