వర్గపోరులో వైసీపీ రెడ్లు దళితవాడలపై పడుతున్నారు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

YSRCP Reddy groups focusing on Dalits
  • వైసీపీలోని రెడ్లలో వర్గపోరు ఎక్కువవుతోంది
  • రెడ్లలో రెండు గ్రూపులు ఏర్పడితే వారి దృష్టి దళితులపై పడుతుంది
  • చిన్నచిన్న గొడవలకు రెడ్లు చీలిపోతున్నారు
వైసీపీలోని రెడ్లపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్లలో వర్గపోరు ఎక్కువవుతోందని ఆయన అన్నారు. వర్గపోరులో వీరు దళితవాడలపై పడుతున్నారని... ఈ గ్రూపులతో దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వైసీపీ రెడ్లలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయంటే వారి దృష్టి దళితులపై పడుతుందని అన్నారు. చిన్నచిన్న గొడవల కారణంగా వైసీపీలోని రెడ్లు చీలిపోతుండటం బాధను కలిగిస్తోందని చెప్పారు. 

తాను తప్పుగా మాట్లాడి ఉంటే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ లేకపోతే తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేది కాదని చెప్పారు. అన్ని వర్గాలు సహకరించడం వల్లే తనకు మెజార్టీ వచ్చిందని, లేకపోతే మెజార్టీ వచ్చేది కాదని అన్నారు.
Go Back to Shorts
K Narayana Swamy
YSRCP
Reddys

More Telugu News