కేటీఆర్ వ్యాఖ్యలు శుద్ధ అబద్ధం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్
- మోదీ పర్యటనలో కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ పీఎంవో నుంచి సమాచారం అందిందన్న కేటీఆర్
- అలాంటి సమాచారమేదీ పంపలేదన్న కేంద్రమంత్రి
- కేసీఆర్ పాల్గొనడం లేదంటూ సీఎంవోనే సమాచారం ఇచ్చిందని వివరణ
కాగా, ఇదే విషయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. అనారోగ్యం కారణంగానే మోదీ పర్యటనకు తాను అందుబాటులో ఉండడం లేదని అప్పట్లో కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారని అన్నారు.