India: భారత్ లో పెరుగుతున్న కరోనా ప్రభావం... ఒక్క రోజులోనే 3 వేలకు పైగా కేసులు!

Corona Virus slowly increasing in India
షార్ట్స్‌లో చూడండి
మన దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు వేలకు పైగా నమోదవుతూ వచ్చిన కేసుల సంఖ్య నిన్న పెరిగింది. గత 24 గంటల్లో దాదాపు 5 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 3,303 మందికి కరోనా నిర్ధారణ అయింది.

ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.6 శాతానికి పెరిగింది. మరోవైపు నిన్న నమోదైన కేసుల్లో 1,367 కేసులు ఢిల్లీ నుంచి వచ్చాయి. యూపీ, హర్యానా, మిజోరాం, కేరళ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

మరోపక్క, గత 24 గంటల్లో 2,563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 39 మంది కరోనా కారణంగా చనిపోగా... వీటిలో కేరళలోనే 36 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 16,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 188 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 19.5 లక్షల మంది టీకా వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News