yash: 13 రోజుల్లో ' కేజీఎఫ్ 2' వసూళ్లు ఇవే!

  • ఈ నెల 14వ తేదీన 'కేజీఎఫ్ 2' విడుదల
  • భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా 
  • 13 రోజుల్లో 942 కోట్లకి పైగా వసూళ్లు 
  • పార్టు 3 కూడా ఉంటుందని చెప్పిన హీరో యశ్   
KGF 2 Movie Update

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్ 2' సినిమా రూపొందింది. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. కన్నడతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఎమోషన్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సినిమా, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 121.30 కోట్ల గ్రాస్ ను .. 75.45 కోట్ల షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 942 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. వసూళ్ల పరంగా ఇంకా ఈ సినిమా కొత్త రికార్డులను సెట్ చేసే పనిలోనే ఉంది. 

ప్రశాంత్ నీల్ టేకింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. యశ్ యాక్టింగ్ .. సంజయ్ దత్ విలనిజం .. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. పార్టు 3 కూడా ఉంటుందని యశ్ చెప్పిన దగ్గర నుంచి అందరిలో మళ్లీ ఆసక్తి మొదలైంది. మరి పార్టు 3 రంగంపైకి రావడానికి ఎంత సమయం పడుతుందనేది చూడాలి.

More Telugu News