కజిన్ పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి సందడి!

Junior NTR wife Pranathi in her cousins wedding
  • 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్
  • తన విరామ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తున్న తారక్
  • కజిన్ పెళ్లిలో సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో ఆకట్టుకున్న ప్రణతి
'ఆర్ఆర్ఆర్' సినిమా సక్సెస్ ను జూనియర్ ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్నాడు. తొలిసారి ఆయన నటించిన సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కావడం, ఘన విజయాన్ని సాధించడం తెలిసిందే. తాజాగా తారక్ హనుమాన్ దీక్షను కూడా స్వీకరించాడు. తారక్ కు తన కుటుంబం అన్నా, కుటుంబంతో గడపడమన్నా ఎంతో ఇష్టం. బయట ప్రపంచంతో ఎక్కువగా గడపని ఎన్టీఆర్... తనకు దొరికే అతికొద్ది విరామ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తుంటాడు.

ఇదిలావుంచితే, ఎన్టీఆర్ భార్య ప్రణతి ఓ వేడుకలో పాల్గొన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కజిన్ పెళ్లికి హాజరైన ప్రణతి అక్కడ చాలా సందడి చేశారు. సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో ఉన్న ఆమె ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 
Go Back to Shorts
Justin Trudeau
Wife
Pranathi

More Telugu News