Shera: సల్మాన్ ఖాన్ బాడీగార్డు జీతం ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!

Salman Khan bodyguard Shera salary is more than CEOs salary as per reports
  • సల్మాన్ బాడీగార్డుగా షేరా
  • 28 ఏళ్లుగా సల్మాన్ తో సాన్నిహిత్యం
  • గతంలో ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కు సేవలందించిన షేరా
  • ఏడాదికి రూ.2 కోట్ల వేతనం
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కంటికిరెప్పలా కాపాడుతూ, ఆయన వెన్నంటే తిరుగుతుండే బాడీగార్డు ఎంత జీతం తీసుకుంటాడో తెలిస్తే ఎవరైనా కళ్లు తేలేయాల్సిందే! సల్మాన్ ఖాన్ బాడీగార్డు పేరు షేరా. కండలు తిరిగిన దేహంతో ఎంతో దృఢంగా కనిపించే షేరా... ధైర్యసాహసాల పరంగానూ మేటి. గతంలో మిస్టర్ ముంబయి (జూనియర్) టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. మిస్టర్ మహారాష్ట్ర జూనియర్ విభాగంలో ఫైనలిస్ట్. 

ఇక, సల్మాన్ తో షేరా అనుబంధం 28 ఏళ్లుగా కొనసాగుతోంది. సల్మాన్ అతడికి ఏడాదికి రూ.2 కోట్లు వేతనం రూపంలో ఇస్తాడన్న విషయం వెల్లడైంది. దేశంలోని కొన్ని కంపెనీల సీఈఓల జీతం కంటే షేరా వార్షికాదాయమే ఎక్కువ. షేరా... సల్మాన్ ఖాన్ వద్ద చేరకముందు అంతర్జాతీయ సెలబ్రిటీలకు భారత్ లో బాడీగార్డుగా వ్యవహరించాడు. మైఖేల్ జాక్సన్, విల్ స్మిత్, పారిస్ హిల్టన్, జాకీ చాన్ వంటి ప్రముఖులకు సేవలు అందించాడు. 

ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఎక్కడకి వెళ్లాలన్నా షేరా ఉండాల్సిందే. సాధారణంగా ఇతర సెలబ్రిటీలకు బౌన్సర్ల టీమ్ ఉంటుంది. కానీ, సల్మాన్ ఖాన్ వెంట ప్రధానంగా షేరా మాత్రమే కనిపిస్తుంటాడు. తన వేతనం గురించి షేరా గతేడాది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నెలకు రూ.15 లక్షలకు పైగానే వేతనం అందుకుంటానని తెలిపాడు.
Shera
Bodyguard
Salman Khan
Salary
Bollywood

More Telugu News