Telangana: తెలంగాణ ఘ‌న‌త‌!... సంస‌ద్ ఆదర్శ గ్రామాల్లో టాప్ టెన్ గ్రామాలు రాష్ట్రానివే!

top 10 Sansad Adarsh Garmina Yojana villages are telangana villages
  • సంసద్ ఆద‌ర్శ గ్రామీణ యోజ‌న కింద ప‌ల్లెల జాబి‌తా ప్ర‌క‌ట‌న‌
  • టాప్ 10 గ్రామాల‌న్నీ తెలంగాణ ప‌ల్లెలే
  • టాప్ 20లో ఒక్క‌టి మిన‌హా 19 స్థానాలూ తెలంగాణ‌వే
  • సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తూ కేటీఆర్ ట్వీట్‌
కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంద‌న‌డానికి ఇది మ‌రో నిద‌ర్శ‌నం. కేంద్రం ప్ర‌క‌టించిన సంస‌ద్ ఆద‌ర్శ గ్రామాల జాబితాలో తొలి ప‌ది స్థానాల‌ను తెలంగాణ‌కు చెందిన ప‌ల్లెలే ద‌క్కించుకున్నాయి. సంస‌ద్ ఆద‌ర్శ గ్రామాల టాప్ టెన్ జాబితాలో ఒక్క‌టంటే ఒక్క గ్రామం కూడా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌ది లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తం ప‌ది స్థానాల‌ను కూడా తెలంగాణ గ్రామాలే ద‌క్కించుకున్నాయి. 

ఇక ఈ జాబితాలో తొలి 20 స్థానాల్లో ఒక్క స్థానం మిన‌హా మిగిలిన 19 స్థానాలు కూడా తెలంగాణ గ్రామాలే ఉన్నాయి. సంస‌ద్ ఆద‌ర్శ గ్రామీణ యోజ‌న కింద కేంద్రం అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామాల‌ను ఆయా గ్రామాలు సాధించిన అభివృద్ధి ఆధారంగా ర్యాంకుల వారీగా ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. గ్రామాల‌ను అభివృద్ధి ప‌థంలో దూసుకెళ్లేలా చేసిన సీఎం కేసీఆర్‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Telangana
KTR
TRS
Sansad Adarsh Garmina Yojana

More Telugu News