ఇళ‌య‌రాజాకు జీఎస్టీ నోటీసులు... రూ.1.8 కోట్ల ప‌న్ను క‌ట్టాల‌ని ఆదేశం

GST issues notice to Ilaiyaraja
  • ఇదివ‌ర‌కే ఇళ‌య‌రాజాకు 3 నోటీసులు
  • స్పందించక‌పోవ‌డంతో తాజా నోటీసు
  • ప‌న్నుకు అద‌నంగా వ‌డ్డీ, జ‌రిమానా కూడా చెల్లించాల్సిందేనంటూ ‌వెల్లడి 
ప్ర‌ముఖ సినీ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాకు మ‌రో షాక్ త‌గిలింది. ఇటీవ‌లే ఐటీ నోలీసులు అందుకున్న ఆయ‌న‌కు తాజాగా జీఎస్టీ శాఖ నుంచి కూడా నోటీసులు జారీ అయ్యాయి. రూ.1.8 కోట్ల మేర ప‌న్ను క‌ట్టాలంటూ జీఎస్టీ చెన్నై శాఖ నుంచి మంగ‌ళ‌వారం ఇళ‌య‌రాజాకు నోటీసులు వచ్చాయి. ఈ మొత్తానికి వ‌డ్డీ, జ‌రిమానా అధిక‌మ‌ని కూడా ఆ నోటీసుల్లో జీఎస్టీ తెలిపింది.

ఇప్ప‌టికే ఈ ప‌న్ను చెల్లింపున‌కు సంబంధించి ఇళ‌య‌రాజాకు మూడు నోటీసులు జారీ అయ్యాయ‌ట‌. అయితే ఆ నోటీసుల‌కు ఇళ‌య‌రాజా నుంచి స్పంద‌న లేక‌పోవ‌డంతోనే జీఎస్టీ తాజా నోటీసును జారీ చేసింది. 
Go Back to Shorts
Ilaiyaraja
GST
Notices

More Telugu News