Realme: రియల్ మీ బడ్జెట్ ఫోన్ ‘నార్జో 50ఏ ప్రైమ్’ విడుదల

  • రెండు వేరియంట్లలో లభ్యం
  • 4జీబీ, 64జీబీ ధర రూ.11,499
  • 4జీబీ, 128జీబీ ధర రూ.12,499
  • 28 నుంచి అమెజాన్ లో విక్రయాలు
Realme Narzo 50A Prime launched in India

రియల్ మీ సంస్థ.. నార్జో 50 ఏ ప్రైమ్ పేరుతో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అమెజాన్, రియల్ మీ డాట్ కామ్ పోర్టళ్లలో ఈ ఫోన్ విక్రయాలు 28 నుంచి ప్రారంభం కానున్నాయి. నార్జో 50ఏ ప్రైమ్ 4జీబీ ర్యామ్ ఆప్షన్ తో రెండు రకాల స్టోరేజీతో 64జీబీ, 128జీబీతో అందుబాటులో ఉంటుంది. 


రెండు రంగుల్లో లభిస్తుంది. 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్, 60 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో ఉంటుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. 50 మెగాపిక్సల్ తో ప్రధాన కెమెరా లెన్స్, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ ఉంటాయి. ముందు భాగంలో 8 మెగాపికల్స్ కెమెరాను ఏర్పాటు చేశారు. 

యూనిసాక్ టీ612 ప్రాసెసర్ తో వచ్చే రియల్ మీ నార్జో 50ఏ ప్రైమ్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 18 వాట్ ఫాస్ట్ చార్జర్ కు సపోర్ట్ చేస్తుంది. కానీ, మొబైల్ బాక్స్ తో చార్జర్ రాదు. ఆండ్రాయిడ్ 11పై పనిచేస్తుంది. 8.1 ఎంఎం సైజుతో ఉండే ఈ ఫోన్ నార్జో సిరీస్ లోనే అతి పలుచనైనది. 4జీబీ, 64జీబీ ధర రూ.11,499. 4జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.12,499.

More Telugu News