చైనాలో కరోనా ఉగ్రరూపం.. వేలల్లో నమోదవుతున్న కేసులు
- దేశంలో నిన్న ఒక్క రోజే 24,326 కేసులు
- షాంఘైలో 12 మంది మృతి
- సత్ఫలితాలు ఇవ్వలేకపోతున్న జీరో-కొవిడ్ విధానం
రాజధాని బీజింగ్‌లో 10 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి ఆ దేశం అవలంబిస్తున్న జీరో-కొవిడ్ విధానం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఇదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌తోపాటు కఠిన ఆంక్షలు విధించడంతో షాంఘైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.