India: 15 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య.. ఇండియా కరోనా అప్డేట్స్!

Corona active cases in India crosses 15000
షార్ట్స్‌లో చూడండి
ఇండియాలో కరోనా కేసులు మరోసారి 2 వేలకు పైగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4.5 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 2,527 మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్క ఢిల్లీలోనే అత్యధికంగా 1,042 కేసులు నమోదయ్యాయి. 

ఇదే సమయంలో దేశంలో 33 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వీటిలో 31 మరణాలు కేరళలో సంభవించగా.. ఢిల్లీలో ఇద్దరు మరణించారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 1,656 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ రోజు కూడా కరోనా నుంచి కోలుకున్న వారికంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. 

దేశంలో పాజిటివిటీ రేటు 0.56 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.75 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 15,079 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేశారు. నిన్న 19.13 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News