Yash: తెలుగు రాష్ట్రాల్లో 'కేజీఎఫ్ 2' రికార్డు!

  • ఈ నెల 13వ తేదీన విడుదలైన 'కేజీఎఫ్ 2'
  • తెలుగు రాష్ట్రాల్లో 61 కోట్ల షేర్ 
  • అనువాద సినిమాల్లో ఇదో రికార్డు  
  • ప్రపంచవ్యాప్తంగా 7 రోజుల్లో 700 కోట్లు
KGF 2 Movie Update

'కేజీఎఫ్' సినిమాకి ముందు కన్నడలో యశ్ అనే ఒక హీరో ఉన్నాడనే సంగతి ఇతర భాషల్లోని ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. 'కేజీఎఫ్' తరువాత చాలామంది యశ్ కి అభిమానులుగా మారిపోయారు. 20 సినిమాల లోపే నటించిన ఈ హీరో, రెండే రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

ఇటీవల విడుదలైన 'కేజీఎఫ్ 2' హిందీ వెర్షన్ 300 కోట్ల వసూళ్లకు చేరువవుతూ ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 7 రోజుల్లో 700 కోట్లను రాబట్టడం విశేషంగా మారిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయాని కొస్తే, ఇంతవరకూ 61 కోట్ల షేర్ ను సాధించింది. ఒక డబ్బింగ్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు దక్కడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

ఈ మధ్య కాలంలో ఏ డబ్బింగ్ సినిమా కూడా ఈ స్థాయిలో ప్రభావితం చేసింది లేదు. రజనీ 'పెద్దన్న' .. సూర్య 'ఈటి' .. అజిత్ 'వలిమై' .. విజయ్ 'బీస్ట్' ఇటీవలే ఇక్కడి థియేటర్లకు వచ్చాయి. ఈ హీరోలందరికీ కూడా తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. అయినా వాళ్లందరి సినిమాలకి మించి యశ్ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం.

More Telugu News