India: దేశంలో వరుసగా మూడో రోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India corona updates
షార్ట్స్‌లో చూడండి
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే... కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 4.48 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,451 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఢిల్లీలో 965 కేసులు నమోదు కాగా... హర్యానా, కేరళలో 300కు పైగా కేసులు వచ్చాయి. 

ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 54 మంది మృతి చెందారు. 1,589 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,241గా ఉంది. దేశంలో రోజువారీ రికవరీ రేటు 98.75 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజు 18 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News