Chiranjeevi: 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ అధికారిక ప్రకటన!

Acharya Pre Release Event Date Fixed
  • కొరటాల నుంచి 'ఆచార్య'
  • నక్సలైట్లుగా చిరూ .. చరణ్ 
  • హీరోయిన్లుగా కాజల్, పూజ  
  • ఈ నెల 29వ తేదీన విడుదల 

చిరంజీవి - చరణ్ కథానాయకులుగా కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందింది. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటలు .. ఇతర అప్ డేట్లు అంచనాలు పెంచుతూ వెళ్లాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. కొంతసేపటి క్రితం అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.

చిరంజీవి -  చరణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో నక్సలైట్స్ గా కనిపించనున్నారు. దేవాలయ భూముల ఆక్రమణకు పాల్పడిన కొంతమంది అవినీతి పరుల ఆటకట్టించే దిశగా ఈ కథ నడుస్తుంది. చిరంజీవి సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది. ఈ నెల 29న విడుదలవుతున్న ఈ సినిమాకి రెజీనా ఐటమ్ సాంగ్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది.

  • Loading...

More Telugu News