AAP: క‌ర్ణాట‌కలోనూ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తాం: ఆప్ చీఫ్ కేజ్రీవాల్

arvind kejriwal comments on karnataka assembly elections
  • బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌లో కేజ్రీవాల్‌
  • కర్ణాట‌క రైతుల‌తో స‌మావేశం
  • పార్టీలో చేరిన రైతు ఉద్య‌మ నేత కోడిహ‌ళ్లి చంద్ర‌శేఖర్‌
క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్ణాట‌క‌లోనూ త‌మ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. గురువారం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేజ్రీవాల్‌... క‌ర్ణాట‌క రాష్ట్ర రైతులతో ప్ర‌త్యేకంగా స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఢిల్లీ, పంజాబ్‌ లలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన మాదిరిగానే క‌ర్ణాట‌క‌లోనూ త‌మ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా రైతు ఉద్య‌మ నేత కోడిహ‌ళ్లి చంద్ర‌శేఖర్ ఆప్‌లో చేరారు. ఆయనకు కేజ్రీవాల్ పార్టీ కండువా క‌ప్పి ఆప్‌లోకి సాద‌రంగా ఆహ్వానించారు. కేజ్రీవాల్ బెంగ‌ళూరు స‌భ‌కు భారీ సంఖ్య‌లో రైతులు హాజ‌ర‌య్యారు.
AAP
Arvind Kejriwal
Karnataka
AAP Karnataka

More Telugu News