తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి అధ్య‌క్షుడు నారాయణ్ దాస్ నారంగ్ క‌న్నుమూత‌

narang passes away
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ్ దాస్ కె. నారంగ్ (78) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయ‌న హైద‌రాబాద్‌లోని స్టార్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందారు. ప‌రిస్థితి విష‌మించి ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు చెప్పారు. 

నారంగ్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్ అధినేత అయిన‌ నారంగ్ ప్ర‌స్తుతం నాగార్జునతో 'ఘోస్ట్', ధనుశ్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. గ‌తంలోనూ ప‌లు సినిమాలు నిర్మించారు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గాను ఆయ‌న‌ సేవలు అందించారు.
Go Back to Shorts
passes away
narang
Tollywood

More Telugu News