పోర్న్ మూవీలో నటించిందన్న అనుమానంతో.. భార్యను హతమార్చిన ఉన్మాది!
- బెంగళూరులో ఆటో డ్రైవర్ అఘాయిత్యం
- రెండు నెలల క్రితం పోర్న్ వీడియో వీక్షణ
- అందులో ఉన్నది తన భార్యేనన్న అనుమానం
- కత్తితో దాడి చేయడంతో ఆమె మృతి
వీరికి వివాహమై 15 ఏళ్లు కాగా, ఐదుగురు సంతానం కలిగారు. అందరూ కలిసే ఉంటున్నారు. రెండు నెలల క్రితం పోర్న్ వీడియోను చూసిన తర్వాత భార్యపై అనుమానంతో ఆమెను కొట్టాడు. 20 రోజుల క్రితం మరోసారి దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీన్ని తట్టుకోలేకపోయిన బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయబోగా ఆమె అడ్డుకుంది.
తాజాగా గత ఆదివారం జషీర్ పాషా తన భార్యపై కత్తితో దాడి చేశాడు. అది చూసిన పాషా పెద్ద కుమారుడు తాత దగ్గరకు వెళ్లి చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే, వారు ఇంటికి వచ్చేసరికే ఆమె విగతజీవిగా పడి ఉంది.