ముగిసిన గడువు.. రూ. 302 కోట్ల ట్రాఫిక్ చలానాల వసూలు
- 5 కోట్ల పెండింగ్ చలానాలకు గాను 3 కోట్ల చలానాలు మాత్రమే వసూలు
- మొత్తంగా రూ. 1,015 కోట్ల చలానాలు జారీ
- గడువు పెంపును సద్వినియోగం చేసుకున్న వాహనదారులు
నిన్న రాత్రి 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 302 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా ఐదు కోట్ల పెండింగ్ చలానాలకు గాను 3 కోట్ల చలానాలు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం రూ.1,015 కోట్ల చలానాలు జారీ చేయగా, రాయితీ పోను రూ. 302 కోట్లు వసూలైనట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.