Roja: మంత్రి రోజా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌.. దిష్టి తీసిన భ‌ర్త సెల్వ‌మ‌ణి.. ముద్దుపెట్టిన కూతురు

roja takes oath
షార్ట్స్‌లో చూడండి
సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొత్త మంత్రి ఆర్కే రోజా అనంత‌రం ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్ర‌మంలో ఆమె భ‌ర్త‌, కుమారుడు, కూతురు, వైసీపీ నేత‌లు కూడా పాల్గొన్నారు. రోజా బాధ్యతలు స్వీకరించేముందు ఆమెకు భ‌ర్త సెల్వ‌మ‌ణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. రోజా మంత్రి చాంబర్‌లోని చైర్‌లో కూర్చున్న అనంత‌రం ఆమెకు కూతురు ముద్దు పెట్టారు.  

                         
ఈ సంద‌ర్భంగా రోజా మాట్లాడుతూ... త‌న‌పై సీఎం వైఎస్‌ జగన్ కు ఉన్న‌ నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పారు. ఏపీలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వైసీపీని స్థాపించ‌కముందు నుంచే  తాను జగన్ అడుగు జాడల్లో నడిచానని చెప్పుకొచ్చారు. ఏపీ మంత్రులుగా ఉన్న వాళ్లంతా జగన్ కు సైనికుల్లా పనిచేశారని ఆమె చెప్పారు. 

జగన్ లాంటి గొప్ప‌ నేతతో కలిసి నడవడం త‌మ‌ అదృష్టంగా భావిస్తున్నామ‌ని అన్నారు. కాగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు సీఎం వైఎస్‌ జగన్‌ను రోజా కలిశారు. గండికోట నుంచి బెంగళూరుకు టూరు కోసం మొదటి బస్సు విష‌యంపై తొలి సంతకం చేసినట్టు చెప్పారు.
Go Back to Shorts
Roja
YSRCP
Andhra Pradesh

More Telugu News