New Cabinet: కొత్త క్యాబినెట్ కూర్పు పూర్తయింది... జాబితాను గవర్నర్ కు పంపిస్తున్నాం: సజ్జల

Sajjala says new cabinet members names finalized
  • ఏపీలో కొత్త క్యాబినెట్ 
  • పాత మంత్రుల రాజీనామాలు
  • కొత్త మంత్రుల జాబితా ఖరారు చేసిన సీఎం జగన్
  • రాత్రి 7 గంటలకు గవర్నర్ కు జాబితా
ఏపీ కొత్త క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాత్రి 7 గంటలకు కొత్త మంత్రివర్గ జాబితాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపిస్తామని తెలిపారు. నూతన మంత్రివర్గ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్లో ఉంచి రాజ్ భవన్ కు పంపుతామని, గవర్నర్ ఆమోదం తర్వాత సీఎం జగన్ ఫోన్ ద్వారా కొత్త మంత్రులకు సమాచారం అందిస్తారని సజ్జల వివరించారు.

పాత మంత్రివర్గంలోని 24 మంది రాజీనామాలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొత్తగా మంత్రివర్గంలో ఎవరికి చోటు ఇవ్వాలి? పాత మంత్రుల్లో ఎవరిని కొనసాగించాలి? అనే అంశాలను సీఎం జగన్ గత కొన్నిరోజుల్లోగా సజ్జలతో చర్చిస్తున్నారు. 

సీఎం జగన్, సజ్జల పలుమార్లు దీనిపై సమావేశమయ్యారు. ఇవాళ కూడా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సజ్జల, కోర్ కమిటీతో భేటీ నిర్వహించి కొత్త క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు చేశారు. అన్ని విధాలుగా పూర్తి సంతృప్తి చెందాక కొత్త మంత్రుల జాబితాను ఖరారు చేశారు.
New Cabinet
CM Jagan
Sajjala Ramakrishna Reddy
Governor
YSRCP
Andhra Pradesh

More Telugu News