ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోబోము.. చట్టం తనపని తాను చేస్తుంది: పాక్ కాబోయే కొత్త ప్రధాని షరీఫ్
- పాక్ పెద్ద సంక్షోభాన్ని గట్టెక్కింది
- కొత్త ఉదయానికి స్వాగతం
- ఎవరికీ అన్యాయం చేయం
- ట్విట్టర్లో స్పందించిన షబాజ్ షరీఫ్
‘‘ఎవరిపైనా మేము ప్రతీకారం తీర్చుకోబోము. ఎవరికీ అన్యాయం చేయబోము. అలాగే, ఎవరినీ జైల్లో పెట్టం. కానీ చట్టం మాత్రం తనపని తాను చేస్తుంది’’అని షెబాజ్ అన్నారు. ఏప్రిల్ 11న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు పాకిస్థాన్ పార్లమెంటు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా సమావేశం కానుంది. పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాసం ద్వారా అధికారం కోల్పోయిన మొదటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కావడం గమనార్హం.